అంతా సాయిపల్లవి మహిమా!

Shyam Singha Roy movie update
  • తెలుగులో మంచి ఇమేజ్
  • తమిళ .. మలయాళ భాషల్లో క్రేజ్
  • ఇతర భాషల్లో మంచి మార్కెట్
  • తాజా చిత్రంగా రానున్న 'శ్యామ్ సింగ రాయ్'
కథానాయికగా తెరపైకి రావడం ఒక ఎత్తు .. కథానాయికగా రాణించడం ఒక ఎత్తు. గ్లామరస్ హీరోయిన్లతో పోటీపడుతూ స్టార్ స్టేటస్ ను అందుకోవడం మరో ఎత్తు. అలాంటి ఎత్తులను అవలీలగా అధిగమించిన కథానాయికగా సాయిపల్లవి కనిపిస్తుంది. ఈ క్రమంలో ఆమె తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'శ్యామ్ సింగ రాయ్' రెడీ అవుతోంది.

రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాని సరసన నాయికగా సాయిపల్లవి కనిపించనుంది. ఈ నెల 24వ తేదీన భారీ స్థాయిలో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ సినిమా శాటిలైట్ .. డిజిటల్ .. హిందీ డబ్బింగ్ రైట్స్ అన్నీ కలుపుకుని 30 కోట్లవరకూ వచ్చాయని చెప్పుకుంటున్నారు.

తెలుగులో నానీకి మంచి క్రేజ్ ఉంది .. అలాగే ఆయన డబ్బింగ్ సినిమాలకి కూడా మంచి మార్కెట్ ఉంది. అయితే తమిళ ... మలయాళ భాషల్లో కూడా సాయిపల్లవికి విపరీతమైన క్రేజ్ ఉంది. ఆమె ఉండటం ఈ సినిమాకి ప్లస్ అయిందనీ, ఈ సినిమా ఈ స్థాయి బిజినెస్ జరుపుకోవడానికి కారణం కూడా ఆమె మహిమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Go Back to Shorts
Nani
Sai Pallavi
Krithi Shetty
Shyam Sigha Roy Movie

More Telugu News