మరో పెద్ద బ్యానర్లో 'ఉప్పెన' బ్యూటీ!

Krithi Shetty Upcoming Movies
  • వరుస సినిమాలతో కృతి బిజీ
  • రిలీజ్ కి రెడీగా 'శ్యామ్ సింగ రాయ్'
  • సెట్స్ పై మూడు సినిమాలు
  • మరో ప్రాజెక్టుకి  గ్రీన్ సిగ్నల్    
టాలీవుడ్లో ఇప్పుడు దూసుకుపోతున్న యంగ్ హీరోయిన్ గా కృతి శెట్టి కనిపిస్తుంది. 'ఉప్పెన' సినిమాతో ఈ సుందరి కుర్రాళ్ల మనసులను పొలోమంటూ కొల్లగొట్టేసింది. ఆ తరువాత వరుస సినిమాలను ఒప్పేసుకుంటూ తన దూకుడు చూపిస్తోంది. ఆమె తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'శ్యామ్ సింగ రాయ్' సిద్ధమవుతోంది.

ఇక సుధీర్ బాబు సరసన నాయికగా 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' ముగింపు దశలో ఉంది. ఇంద్రగంటి ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇక ఆ తరువాత నితిన్ జోడిగా 'మాచర్ల నియోజక వర్గం' .. చైతూ సరసన 'బంగార్రాజు'తో పాటు రామ్ జంటగా ఒక సినిమా చేస్తోంది.

ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆమె ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఒక పెద్ద బ్యానర్లో  సీనియర్ డైరెక్టర్ ఆమెను ఒప్పించినట్టుగా చెబుతున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు. చూడాలిమరి కృతిని అంతగా కట్టిపడేసిన ఆ కథేమిటో!
Go Back to Shorts
Krithi Shetty
Shyam Singha Roy
Nani
Ram

More Telugu News