Mummy: పెరూలో బయటపడ్డ వెయ్యేళ్ల నాటి మమ్మీ... ఎలా ఉందో చూడండి!

Thousand years aged Mummy found in Peru
పురాతన కాలంలో ఈజిప్టులో రాచరికపు వ్యక్తులు మరణించినప్పుడు వారిని మమ్మీలుగా మార్చి భద్రపరిచేవారు. ఇవి కొన్ని వేల సంవత్సరాలు గడచినప్పటికీ కుళ్లిపోకుండా ఉంటాయి. తాజాగా పెరూలో ఓ మమ్మీ బయల్పడింది. పెరూ రాజధాని లిమా సమీపంలో పురావస్తు శాస్త్రజ్ఞులు చేపట్టిన తవ్వకాల్లో దీన్ని గుర్తించారు. ఈ మమ్మీ 800 నుంచి 1,200 ఏళ్ల నాటిది అయ్యుండొచ్చని అంచనా వేస్తున్నారు.

కజామార్క్విల్లా ప్రాంతంలో ఇటీవల శాన్ మాక్రోస్ నేషనల్ యూనివర్సిటీ తవ్వకాలు చేపట్టింది. భూగర్భం లోపల భద్రపరిచి ఉన్న ఈ మమ్మీ తాళ్లతో కట్టివేసి ఉన్న స్థితిలో కనిపించింది. దక్షిణ పెరూలో ఇదొక అంత్యక్రియల ఆచారం అని పరిశోధకులు వెల్లడించారు. ఈ మమ్మీ ఇక్నా నాగరికతకు ముందు కాలం నాటిది అని వారు చెబుతున్నారు.

హిస్పానిక్ కాలం ముందునాటి పరిస్థితులు ఎలా ఉండేవో తెలుసుకునేందుకు ఈ మమ్మీ దోహదపడుతుందని పీటర్ వాన్ డాలెన్ లూనా అనే ఆర్కియాలజిస్టు తెలిపారు. తాము కనుగొన్న మమ్మీ 25 నుంచి 30 ఏళ్ల వయసున్న ఓ యువకుడిదిగా భావిస్తున్నట్టు వెల్లడించారు.
Mummy
Lima
Peru

More Telugu News