కరోనా నుంచి కోలుకున్న కమలహాసన్.. అయినా మరో రెండ్రోజులు ఆసుపత్రిలోనే!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కరోనా నుంచి కోలుకున్న కమలహాసన్.. అయినా మరో రెండ్రోజులు ఆసుపత్రిలోనే!

Kamal Haasan recovers from Corona
  • గత నెల 22న ఆసుపత్రిలో చేరిన కమల్
  • 3వ తేదీన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న కమల్
  • ఇటీవల అమెరికా నుంచి తిరిగి వచ్చిన వైనం
విలక్షణ నటుడు కమలహాసన్ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఈ మేరకు ఆయన చికిత్స పొందుతున్న చెన్నైలోని శ్రీరామచంద్ర ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. కాసేపటి క్రితం కమల్ హెల్త్ బులెటిన్ ను డాక్టర్లు విడుదల చేశారు. గత నెల 22న స్వల్ప కొవిడ్ లక్షణాలతో తమ ఆసుపత్రిలో చేరారని బులెటిన్ లో వైద్యులు పేర్కొన్నారు. ఇప్పుడు కమల్ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారని... అయితే మరో రెండు రోజుల పాటు తమ సంరక్షణలోనే ఉంటారని చెప్పారు.

ఈ నెల 3వ తేదీన ఆయనను డిశ్చార్జ్ చేస్తామని తెలిపారు. 4వ తేదీ నుంచి ఆయన యథావిధిగా తన పనులను ప్రారంభించవచ్చని చెప్పారు. ఇటీవలే కమలహాసన్ అమెరికా పర్యటన ముగించుకుని వచ్చారు. చెన్నైకు చేరుకున్న తర్వాత దగ్గు వస్తుండటంతో ఆయన డాక్టర్లను సంప్రదించారు. ఆయనకు నిర్వహించిన పరీక్షలో కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది.
Kamal Haasan
Tollywood
Kollywood
Corona Virus
positive

More Telugu News