సర్జరీతో హీరోయిన్ దిశా ప‌టానీ ముఖం మొత్తం పాడైంద‌ని నెటిజ‌న్ల విమ‌ర్శ‌లు.. ఫొటో వైర‌ల్

27-11-2021 Sat 13:39
  • అంతిమ్ సినిమాలో న‌టించిన దిశా ప‌టానీ
  • నిన్న ఈవెంట్‌లో క‌న‌ప‌డిన హీరోయిన్
  • ముఖంలో క‌ళ‌లేకుండా దిశా ప‌టానీ
  • చాలా నీర‌సంగా ఉందంటోన్న నెటిజ‌న్లు
Did Disha Patani get plastic surgery
అందాలు ఆర‌బోస్తూ, కుర్ర‌కారులో సెగ‌లు రేపుతూ క‌న‌ప‌డే హీరోయిన్ దిశా ప‌టానీ తాజాగా ముక్కుకు ప్లాస్టిక్ స‌ర్జరీ చేయించుకున్న‌ట్లు తెలుస్తోంది. అది విక‌టించ‌డంతో ఆమె ముఖం కాస్త మారిపోయిన‌ట్లు క‌న‌ప‌డుతోంది. ఇందుకు సంబంధించిన ఓ ఫొటో వైర‌ల్ అవుతోంది.

ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు స‌ర్జ‌రీలు చేయించుకుని ముఖాన్ని పాడుచేసుకున్నారు. ఇప్పుడు అదే జాబితాలో దిశా ప‌టానీ కూడా చేరింద‌ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. దిశా పటానీని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.  సల్మాన్ ఖాన్ న‌టించిన‌ యాంటిమ్ సినిమా స్క్రీనింగ్‌లో దిశా పటానీ పాల్గొంది.
                  
పసుపు రంగు క్రాప్ టాప్, డెనిమ్స్ ధ‌రించి ఆమె ఈవెంట్‌కు వ‌చ్చింది. ఫొటోల‌కు పోజులు ఇచ్చింది. ఆమె ముఖం మాత్రం  అసాధారణంగా క‌న‌ప‌డింద‌ని అభిమానులు అంటున్నారు.  ఈ ఈవెంట్ లో ఆమె ఫోటోలు బాగోలేవ‌ని చెబుతున్నారు. ఆ హీరోయిన్ స‌ర్జ‌రీ చేయించుకోక‌పోతే బాగుండేద‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

నిన్న‌టి ఈవెంట్లో ఆమెకు సంబంధించిన వీడియోలు కూడా సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్నాయి. బాలీవుడ్‌లో దిశా ప‌టానీకి చాలా పాప్యులారిటీ ఉంది. సామాజిక మాధ్య‌మాల్లో ఆమె త‌న అందాలు చూపుతూ పోస్ట్ చేసే ఫొటోలు బాగా వైర‌ల్ అవుతుంటాయి. ఇప్పుడు ఒక్క‌సారిగా ఈ అమ్మ‌డు ముఖం మ‌రోలా క‌న‌ప‌డుతుండ‌డంతో ఫ్యాన్స్ హ‌ర్ట్ అవుతున్నారు. ఆమె చాలా నీర‌సంగా క‌న‌ప‌డుతోంద‌ని కూడా వాపోతున్నారు.