ఆలోచనలోపడిన 'శ్యామ్ సింగ రాయ్'
- రాహుల్ సాంకృత్యన్ నుంచి 'శ్యామ్ సింగ రాయ్'
- డిఫరెంట్ లుక్ తో కనిపించనున్న నాని
- డిసెంబర్ 24వ తేదీన విడుదల
- అదే రోజున థియేటర్లకు వస్తున్న 'గని'
ఈ సినిమాలో నాని డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడు. ఆయన సరసన నాయికలుగా సాయిపల్లవి .. కృతి శెట్టి .. మడోన్నా సెబాస్టియన్ అలరించనున్నారు. ఈ సినిమాను డిసెంబర్ 24వ తేదీన విడుదల చేయనున్నట్టు కొన్ని రోజుల క్రితమే ప్రకటించారు. సోలో రిలీజ్ డేట్ ను నాని భలే సెట్ చేసుకున్నాడేనని అనుకున్నారు.
కానీ ఇంతలో పోటీగా వరుణ్ తేజ్ సినిమా 'గని' దిగిపోయింది. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమాను ముందుగా డిసెంబర్ 3వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. కానీ ఆ తరువాత 24వ తేదీకి వాయిదా వేసుకున్నారు. దాంతో 'శ్యామ్ సింగ రాయ్' ఆలోచనలో పడ్డాడని అంటున్నారు. మరి ఈ రెండు సినిమాల మధ్య పోటీ ఏ స్థాయిలో నడుస్తుందో చూడాలి.