Prakash Raj: గొంతు బాగాలేదు... ఓ వారం పాటు మౌన వ్రతం: ప్రకాశ్ రాజ్

Prakash Raj reveals his health condition
షార్ట్స్‌లో చూడండి
ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ తన ఆరోగ్య పరిస్థితిపై ట్విట్టర్ లో స్పందించారు. ఆసుపత్రిలో పూర్తిస్థాయిలో వైద్య పరీక్షలు చేయించుకున్నానని వెల్లడించారు. అయితే గొంతులో స్వర తంత్రులకు విశ్రాంతి ఇవ్వాలని, మాట్లాడరాదని డాక్టర్లు సూచించారని తెలిపారు. అంతకుమించి మిగతా ఆరోగ్యానికి ఢోకా లేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఓ వారం పాటు మౌన వ్రతం తప్పదని, సైగలతోనే నెట్టుకొస్తానని వివరించారు.
Go Back to Shorts
Prakash Raj
Vocal Chords
Rest
Health
Twitter

More Telugu News