చిరంజీవి ‘గాడ్ ఫాదర్’లో సల్మాన్‌ఖాన్.. అతిథి పాత్రలో మెరవనున్న బాలీవుడ్ సూపర్ స్టార్!
- ‘లూసిఫర్’ లో పృథ్వీరాజ్ సుకుమార్ పోషించిన పాత్రలో సల్మాన్!
- అధికారికంగా చెప్పని ‘గాడ్ ఫాదర్’ చిత్ర బృందం
- సల్మాన్ కనిపించేది పాటలోనా, పాత్రలోనా? అన్న అనుమానంలో చిరు అభిమానులు
మోహన్‌లాల్‌కు అండగా ఉండే ఈ పాత్ర కనిపించేది కొద్దిసేపే అయినా సినిమాలో అది చాలా కీలకం. అంతేకాదు, ఆ పాత్రకు ఒక పాట కూడా ఉంటుంది. ఈ పాత్ర కోసం ‘గాడ్ ఫాదర్’ బృందం సల్మాన్‌ను సంప్రదిస్తే ఆయన ఓకే చెప్పారట. అయితే, ఈ విషయాన్ని చిత్ర బృందం ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు. దీంతో సల్మాన్ అతిథిపాత్రలో కనిపిస్తారా? లేక, ఏదైనా పాటలో తళుక్కుమంటారా? అన్న విషయంలో స్పష్టత లేకుండా పోయింది.