Nani: 'శ్యామ్ సింగ రాయ్' టీజర్ రిలీజ్ కి డేట్ ఫిక్స్!

  • నాని తాజా చిత్రంగా 'శ్యామ్ సింగ రాయ్'
  • కలకత్తా నేపథ్యంలో నడిచే కథ
  • ఈనెల 18వ తేదీన టీజర్ రిలీజ్
  • వచ్చేనెల 24వ తేదీన సినిమా విడుదల  
Shyam Singha Roy  teaser released

నాని హీరోగా రాహుల్ సాంకృత్యన్ 'శ్యామ్ సింగ రాయ్' సినిమాను రూపొందించాడు. వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమాకి, మిక్కీ జె మేయర్ సంగీతాన్ని అందించాడు. ఈ సినిమా నుంచి ఇంతవరకూ వచ్చిన ప్రచార చిత్రాలకి మంచి ఆదరణ లభించింది. అంతా కూడా ఈ సినిమా పట్ల ఆసక్తితో ఉన్నారు.

చారిత్రక నేపథ్యంతో కూడిన ఈ సినిమా కోసం భారీ సెట్లు వేసి మరీ చిత్రీకరించారు. అందుకోసం భారీ స్థాయిలోనే ఖర్చు చేశారు. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను వదలడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఈ నెల 18వ తేదీన ఈ టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ అధికారిక పోస్టర్ ను రిలీజ్ చేశారు.

నాని సరసన నాయికలుగా సాయిపల్లవి .. కృతి శెట్టి .. మడోన్నా అలరించనున్నారు. జిషు సేన్ గుప్తా .. మురళీ శర్మ ముఖ్యమైన పాత్రలను పోషించారు. కలకత్తా నేపథ్యంలో నడిచే ఈ సినిమాలో నాని డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడు. డిసెంబర్ 24వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. .

More Telugu News