అఫీషియల్.. తన ప్రేయసిని ప్రకటించేసిన కేఎల్ రాహుల్
Add ap7am to your home Screen

అఫీషియల్.. తన ప్రేయసిని ప్రకటించేసిన కేఎల్ రాహుల్

KL Rahul Makes It Official About His Relation
  • హ్యాపీ బర్త్ డే అంటూ పేరు ప్రకటన
  • వారిద్దరూ కలిసి దిగిన ఫొటోలు పోస్ట్
  • బాలీవుడ్ హీరో కూతురితో కొన్నాళ్లుగా రిలేషన్
  • అప్పట్లో మీడియా కథనాలు రాసినా మౌనం
  • రాహుల్ ప్రకటనపై ప్రముఖుల హర్షం
  • క్రికెటర్లు, సినీ నటుల కామెంట్లు, శుభాకాంక్షలు
టీమిండియా ఓపెనర్.. యంగ్ క్రికెటర్ తన ప్రేయసి గురించి అఫీషియల్ గా ప్రకటించేశాడు. తన ప్రియురాలికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ఆ విషయాన్ని ప్రపంచానికి ధ్రువీకరించాడు. ‘‘హ్యాపీ బర్త్ డే మై ‘లవ్’ (హార్ట్ ఎమోజీ)’’ అంటూ ఆమెకు విషెస్ చెప్పాడు. ఇటు ట్విట్టర్, అటు ఇన్ స్టాలో ఆ విషయాన్ని వెల్లడించాడు. దానికి ఆమె కూడా నాకు నువ్వే ఈ ప్రపంచం అని అర్థం వచ్చేలా తెలుపు హార్ట్ ఎమోజీ, భూమి ఎమోజీని పోస్ట్ చేసింది. ఇంతకీ కేఎల్ రాహుల్ ప్రేయసి ఎవరు? అనేనా మీ ప్రశ్న.


బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి తనయ ఆథియా శెట్టి. యస్.. కొన్నాళ్లుగా ఈ ప్రేమ పక్షుల గురించి బాలీవుడ్ లో ఎన్నెన్నో ఊహాగానాలు వినిపించాయి. అయినా కూడా ఆ జంట నుంచి ఎలాంటి సమాధానమూ రాలేదు. వారి మౌనమే చివరకు సమాధానమైంది. మొత్తానికి రాహుల్ కూడా ఓ బంధంలోకి వచ్చేశాడంటూ తెగ సంబురపడిపోతున్నారు అతడి ఫ్యాన్స్.

రాహుల్ పెట్టిన పోస్ట్ కు సునీల్ శెట్టి, రాహుల్ కాబోయే బావమరిది.. అదేనండీ ఆథియా సోదరుడు అహాన్ శెట్టిలూ లైక్ కొట్టేశారు. హార్ట్ సింబల్ ను పంప్ చేశారు. అంతేకాదు.. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ భార్య రితికా సజ్దే కామెంట్ కూడా పెట్టింది. మీ ప్రేమ కలకాలం ఉండాలంటూ కామెంట్ చేసింది. హ్యాపీ బర్త్ డే వదినమ్మ అంటూ క్రికెటర్ మన్ దీప్ సింగ్ విషెస్ చెప్పాడు. అనుష్క శర్మ, సయామీ ఖేర్, సానియా మీర్జా, హార్దిక్ పాండ్యా, సికందర్ ఖేర్ వంటి వారు రాహుల్, ఆథియాల రిలేషన్ షిప్ ను స్వాగతించారు.

కాగా, వరల్డ్ కప్ లో భాగంగా నిన్న స్కాట్లాండ్ ను ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ లు చితకబాదేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేవలం 20 బంతుల్లోనే రాహుల్ అర్ధశతకం బాదేశాడు. తన ప్రేయసి బర్త్ డే రోజే రాహుల్ చెలరేగిపోయాడు. మ్యాచ్ ను ఆథియా కూడా వీక్షించింది. రితికా పక్కన కూర్చుని.. ఓపెనర్ల ఆటకు చీర్స్ చెప్పింది.

KL Rahul
Cricket
Aathiya Shetty
Bollywood
Suneil Shetty
T20 World Cup

More Telugu News