sridevi soda Centre: 'జీ5'లో 'శ్రీదేవి సోడా సెంట‌ర్' కిరాక్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ షురూ

  • ఇప్ప‌టికే థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను అలరించిన సినిమా
  • ఇప్పుడు ఓటీటీ ‘జీ 5’లో  స్ట్రీమింగ్
  • దీపావ‌ళి సంద‌ర్భంగా విడుద‌ల‌
sridevi soda Centre releases

'శ్రీదేవి సోడా సెంట‌ర్'...  ఈ సినిమా ఇప్ప‌టికే థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు ఓటీటీ ‘జీ 5’లో  స్ట్రీమింగ్ అవుతోంది. దీపావ‌ళి సంద‌ర్భంగా జీ5లో కిరాక్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ షురూ అయింద‌ని ఆ సినిమా యూనిట్ ప్ర‌క‌టించింది.  ఈ సినిమాలో సుధీర్‌ బాబు, ఆనంది హీరో, హీరోయిన్లుగా న‌టించారు.  

‘పలాస 1978’  ద‌ర్శ‌కుడు కరుణ కుమార్ ఈ సినిమాను రూపొందించారు. ప‌ల్లెటూరి నేప‌థ్యంలో ప్రేమకథా చిత్రంగా ఈ సినిమా రూపుదిద్దుకుంది. ఈ సినిమాలో నరేశ్, షావుల్ నవగీతమ్ కీలక పాత్రల్లో న‌టించారు. 70ఎమ్‌ఎమ్‌ ఎంటర్‌టైనమెంట్ పతాకంపై విజయ్ చిల్లా, దేవిరెడ్డి శశి ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో సూరిబాబు పాత్రలో సుధీర్‌, శ్రీదేవి పాత్రలో ఆనంది న‌ట‌న‌కు మంచి మార్కులు ప‌డ్డాయి.

More Telugu News