మాజీ మంత్రి దేవేందర్ గౌడ్‌ను కలిసిన బండి సంజయ్.. ఫొటోలు ఇవిగో
- నిన్న దేవేందర్ గౌడ్ నివాసంలో భేటీ
- రాజకీయాలు సహా పలు అంశాలపై చర్చించామన్న సంజయ్
- దేవేందర్ గౌడ్ బీజేపీలో చేరనున్నారా? అంటూ నెటిజన్ల కామెంట్లు
'సీనియర్ నాయకులు, మాజీ మంత్రి శ్రీ దేవేందర్ గౌడ్ గారిని నిన్న వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా ప్రస్తుత రాజకీయాలు సహా పలు అంశాలపై చర్చించాము' అని బండి సంజయ్ వివరించారు. ఈ సందర్భంగా ఆయనతో దిగిన పలు ఫొటోలను బండి సంజయ్ పోస్ట్ చేశారు. దీంతో దేవేందర్ గౌడ్ బీజేపీలో చేరనున్నారా? అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.