నాని చేతుల మీదుగా 'ఓసీఎఫ్ఎస్' టీజ‌ర్ విడుద‌ల‌.. చాలా స‌ర‌దాగా ఉంద‌ని నేచుర‌ల్ స్టార్ కితాబు

ocfc web series trailer  launched by nani
  • జీ5లో ప్ర‌సారం కానున్న 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ'
  • వెబ్ సిరీస్ బృందానికి నాని బెస్ట్ విషెస్..
  • వెబ్ సిరీస్‌కు నిర్మాతగా నాగ‌బాబు కుమార్తె నిహారిక
  • జీ5లో నవంబర్ 19న  ప్రారంభం  
జీ5లో ప్ర‌సారం కానున్న  ఓసీఎఫ్ఎస్ (ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ ) వెబ్ సిరీస్ టీజ‌ర్‌ను నేచుర‌ల్ స్టార్ నాని ఈ రోజు విడుద‌ల చేశాడు. 'ఇదిగో ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ టీజ‌ర్. ఈ వెబ్ సిరీస్ బృందానికి నా బెస్ట్ విషెస్.. టీజ‌ర్ చాలా స‌ర‌దాగా ఉంది' అని నాని పేర్కొన్నాడు. ఈ వెబ్ సిరీస్‌కు నిర్మాతగా నాగ‌బాబు కుమార్తె నిహారిక వ్యవహరిస్తోన్న విష‌యం తెలిసిందే.
             
ఫ్యామిలీ ఎంటర్టైన్ మెంట్ గా రూపుదిద్దుకున్న ఈ వెబ్ సిరీస్‌ జీ5లో నవంబర్ 19న  ప్రారంభం కానుంది. ఈ వెబ్ సిరీస్  40 నిమిషాల నిడివి చొప్పున‌ మొత్తం 5 ఎపిసోడ్లుగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇందులో సంతోష్ శోభన్, సిమ్రాన్ శర్మ హీరో హీరోయిన్లుగా న‌టిస్తుండ‌గా, సీనియర్ నటీనటులు నరేశ్, తులసి కీలక పాత్రలు పోషిస్తున్నారు.  


      
Go Back to Shorts
Nani
Tollywood
web series
Niharika

More Telugu News