Nani: 'శ్యామ్ సింగ రాయ్' ఫస్టు సింగిల్ కి డేట్ ఫిక్స్!

  • నాని నుంచి 'శ్యామ్ సింగ రాయ్'
  • డిఫరెంట్ లుక్ తో కనిపించనున్న నాని 
  • ఆయన సరసన ముగ్గురు నాయికలు 
  • డిసెంబర్  24వ తేదీన విడుదల     
Shyam Singha Roy first single will release on November 6th

విభిన్నమైన కథలకు .. విలక్షణమైన పాత్రలకు నాని ప్రాధాన్యతనిస్తూ ఉంటాడు. అలా ఆయన చేసిన సినిమానే 'శ్యామ్ సింగ రాయ్'. ఈ సినిమా నుంచి నాని లుక్ బయటికి వచ్చిన దగ్గర నుంచి అంచనాలు మరింతగా పెరిగాయి. ఈ సినిమా కథా నేపథ్యం .. చారిత్రక పరమమైన అంశాలు ఆసక్తిని పెంచుతున్నాయి.

వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమాకి మిక్కీ జె మేయర్ సంగీతాన్ని అందించాడు. ఈ సినిమా నుంచి ఫస్టు సింగిల్ ను వదలడానికి డేట్ ను ఫిక్స్ చేశారు. నవంబర్ 6వ తేదీన ఈ సినిమా నుంచి ఫస్టు సింగిల్ ను రిలీజ్ చేయనున్న విషయాన్ని అధికారిక పోస్టర్ ద్వారా స్పష్టం చేశారు.

ఈ పోస్టర్ లో నాని లుక్ కూడా ఆకట్టుకుంటోంది. డిసెంబర్ 24వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. నాని సరసన నాయికలుగా సాయిపల్లవి .. కృతి శెట్టి .. మడోన్నా సెబాస్టియన్ అలరించనున్నారు. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎలాంటి రిజల్టును రాబడుతుందో చూడాలి.

More Telugu News