షారుఖ్‌ ఖాన్ కుమారుడి విడుద‌ల‌పై త‌న‌దైన శైలిలో స్పందించిన‌ రామ్ గోపాల్ వ‌ర్మ‌!
Add ap7am to your home Screen

షారుఖ్‌ ఖాన్ కుమారుడి విడుద‌ల‌పై త‌న‌దైన శైలిలో స్పందించిన‌ రామ్ గోపాల్ వ‌ర్మ‌!

 Diwali has always been reserved for a Khanss release rgv
  • సాధార‌ణంగా ప్ర‌తి దీపావ‌ళికి ఖాన్ల విడుద‌ల ఉంటుంది
  • ఈ దీపావ‌ళికి కూడా ఖాన్ విడుద‌ల‌య్యాడన్న వర్మ 
  • షారుఖ్‌ నివాసం మన్నత్ వద్దకు అభిమానులు    
ముంబయిలోని ఆర్థర్ రోడ్ జైలు నుంచి ఆర్యన్‌ఖాన్ విడుదలయిన విష‌యం తెలిసిందే. 22 రోజుల తర్వాత జైలు నుంచి విడుదలైన ఆర్యన్‌ఖాన్ ను షారుఖ్ ఖాన్ స్వ‌యంగా ఇంటికి తీసుకెళ్లాడు. ఈ స‌మ‌యంలో ఆర్ధర్ రోడ్‌ జైలు వద్దకు షారుక్ అభిమానులు భారీగా తరలివచ్చారు.

రెండు రోజుల క్రితం ఆర్యన్‌కు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయ‌న విడుద‌లయ్యారు. ఈ నేప‌థ్యంలో దీనిపై స్పందించిన వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ప‌లు వ్యాఖ్య‌లు చేశారు. 'సాధార‌ణంగా ప్ర‌తి దీపావ‌ళికి ఖాన్ల విడుద‌ల ఉంటుంది. ఈ దీపావ‌ళికి కూడా ఖాన్ విడుద‌ల‌య్యాడు' అని ఆయ‌న చమత్కరించారు.

బాలీవుడ్ లో దీపావ‌ళి ముందు గతంలో విడుద‌లైన‌ ఆమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్, స‌ల్మాన్ ఖాన్ల‌ సినిమాల‌ను ఉద్దేశించే వ‌ర్మ ఈ ట్వీట్ చేశాడ‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. మ‌రోవైపు, ఈ నెల 3న రేవ్‌పార్టీ, డ్రగ్స్‌ కేసులో అరెస్టయిన ఆర్యన్ ఖాన్ చాలా రోజులకి విడుద‌ల కావ‌డంతో షారుఖ్‌ నివాసం మన్నత్ వద్దకు అభిమానులు భారీగా చేరుకుంటున్నారు.
RGV
Shahrukh Khan
Bollywood

More Telugu News