'శ్యామ్ సింగ్ రాయ్' రిలీజ్ డేట్ ఖరారు!
- నాని నుంచి విభిన్న కథా చిత్రం
- రాహుల్ సాంకృత్యన్ ప్రయోగం
- నాని సరసన ముగ్గురు నాయికలు
- డిసెంబర్ 24వ తేదీన విడుదల
ఆ జాబితాలో సాయిపల్లవి .. కృతి శెట్టి .. మడోన్నా సెబాస్టియన్ కనిపించనున్నారు. ఎవరి పాత్రకి తగిన ప్రాధాన్యత వారికి ఉంది. ఈ సినిమా ఓటీటీలో వస్తుందా? థియేటర్లకు వెళుతుందా? అనే విషయంపై అనేక రకాల ఊహాగానాలు వినిపించాయి. తాజాగా ఈ సినిమా విడుదలకి డేట్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాను డిసెంబర్ 24వ తేదీన విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు.
అందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా వదిలారు. తెలుగుతో పాటు, తమిళ .. మలయాళ .. కన్నడ భాషల్లోను అదే రోజున ఈ సినిమాను విడుదల చేయనున్నారు. మిక్కీ జె. మేయర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు. ఈ సినిమా తన కెరియర్లోనే ప్రత్యేకమైనదిగా నిలిచిపోతుందని నాని నమ్మకంతో చెబుతున్నాడు
.