బీజేపీని అడ్డుకునేందుకు అన్ని పార్టీలు కలసి రావాలి: యూపీ ఎన్నికల నేపథ్యంలో శరద్ పవార్
- బీజేపీయేతర పార్టీలన్నీ ఏకం కావాలి
- ఓట్లు చీలకుండా ఉండటం చాలా కీలకం
- విడివిడిగా పోటీ చేస్తే అది బీజేపీకి లాభం
ఎన్నికల్లో ఓట్లు సాధ్యమైనంతగా చీలకుండా చూడటం చాలా కీలకమని శరద్ పవార్ అన్నారు. బీజేపీయేతర పార్టీలు విడివిడిగా పోటీ చేస్తే అది బీజేపీకి లాభిస్తుందని చెప్పారు. లఖీంపూర్ ఖేరి ఘటనపై ఆయన స్పందిస్తూ కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. చట్టం నుంచి తప్పించుకోవడం ఎవరి వల్ల కాదని అన్నారు. సీబీఐ, ఎన్సీబీ, ఈడీ వంటి కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేస్తూ కేంద్ర ప్రభుత్వం విపక్షాలను టార్గెట్ చేస్తోందని మండిపడ్డారు.