shriya: త‌న కుమార్తె పేరు ఏంటో చెప్పిన హీరోయిన్ శ్రియ‌!

  • ఏడాది క్రితం పాప‌కు జ‌న్మ‌నిచ్చిన శ్రియ‌
  • రాధ అన్న పేరు పెట్టిన‌ట్లు చెప్పిన హీరోయిన్
  • భ‌గవంతుడికి థ్యాంక్స్ చెబుతున్న‌ట్లు పోస్ట్
sriya share aher daughter pic

హీరోయిన్ శ్రియ‌కు పండంటి పాప పుట్టింది. అయితే, ఆ పాప పుట్టిన దాదాపు ఏడాది త‌ర్వాత శ్రియ ఈ విష‌యాన్ని వెల్లడించడం గ‌మ‌నార్హం. ఆ పాప పేరు రాధ అని శ్రియ చెప్పింది. గత ఏడాది ప్రపంచం మొత్తం కరోనా వైర‌స్‌ ప్రభావంతో గందరగోళ పరిస్థితుల్లో వున్న సమయంలో త‌మ ప్రపంచమే మారిపోయిందని శ్రియ తెలిపింది.

ఆ స‌మ‌యం అంతా అడ్వెంచర్, లెర్నింగ్‌తో త‌మ‌ ప్రపంచం నిండిపోయిందని, త‌మ‌ జీవితాల్లోకి ఓ ఏంజిల్‌ వచ్చిందని చెప్పింది. భ‌గ‌వంతుడికి ధన్యవాదాలు చెబుతున్న‌ట్లు ఇన్ స్టాలో పేర్కొంది. తన భర్త, కుమార్తెతో ఫొటోల‌ను ఆమె పోస్ట్ చేసింది. కాగా, వ్యాపారవేత్త ఆండ్రూ కొశ్చివ్‌తో శ్రియ‌కు 2018లో వివాహం జ‌రిగింది. ప్రస్తుతం శ్రియ ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో నటిస్తోంది.

More Telugu News