Chiranjeevi: ఫిబ్రవరి 4న వస్తున్న చిరంజీవి ఆచార్య

  • కొరటాల దర్శకత్వంలో మెగా మూవీ
  • చిరంజీవి, కాజల్ జంటగా ఆచార్య
  • కీలకపాత్ర పోషించిన రామ్ చరణ్
  • సామాజిక అంశంతో రూపుదిద్దుకున్న ఆచార్య
Chiranjeevi Acharya release date fixed

మెగాస్టార్ చిరంజీవి, హిట్ డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో వస్తున్న 'ఆచార్య' చిత్రం రిలీజ్ డేట్ ఫిక్సయింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న ఆచార్య ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని చిత్రబృందం సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.

సామాజిక ఇతివృత్తంతో రూపుదిద్దుకున్న ఆచార్య చిత్రంలో చిరంజీవి సరసన కాజల్ కథానాయిక. రామ్ చరణ్ ఇందులో ఓ ముఖ్యభూమిక పోషించాడు. రామ్ చరణ్ కు జోడీగా పూజ హెగ్డే కనిపించనుంది. వాస్తవానికి ఈ చిత్రాన్ని ఈ వేసవిలో తీసుకురావాలని ప్రయత్నించినా కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతంగా ఉండడంతో విడుదల వాయిదాపడింది. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టయిన్ మెంట్ నిర్మించాయి.

More Telugu News