PellisandaD: 'పెళ్లిసందD' ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథులుగా చిరంజీవి, వెంకటేశ్

Chiranjeevi and Venkatesh as chief guests for PellisandaD pre release event
షార్ట్స్‌లో చూడండి
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు పర్యవేక్షణలో రోషన్, శ్రీలీల జంటగా గౌరి రోణంకి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 'పెళ్లిసందD' చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది. అక్టోబరు 15న దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాలో రాఘవేంద్రరావు ఓ కీలక పాత్ర పోషించడం విశేషం.

ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక ఈ నెల 10న హైదరాబాదులో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అగ్ర కథానాయకులు చిరంజీవి, వెంకటేశ్ వస్తున్నారు. 'పెళ్లిసందD' ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఫిలింనగర్ లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ వేదికగా నిలుస్తోంది. రేపు ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి కార్యక్రమం షురూ కానుంది. 'పెళ్లిసందD' చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించగా, పాటలకు శ్రోతల నుంచి విశేష స్పందన లభిస్తోంది.
Go Back to Shorts
PellisandaD
Pre Release Event
Chiranjeevi
Venkatesh
Tollywood

More Telugu News