Nagababu: విష్ణు నిలబడ్డాడని ప్రకాశ్ రాజ్ ను వెనక్కి నెట్టలేం: నాగబాబు

  • లోకల్, నాన్ లోకల్ వ్యవహారంపై నాగబాబు ఆగ్రహం
  • పనికిమాలిన స్లోగన్ అంటూ మండిపాటు
  • నరేశ్ 'మా'ను భ్రష్టుపట్టించాడని ఆరోపణ
  • 'మా'కు ప్రకాశ్ రాజ్ సేవలు అవసరమని ఉద్ఘాటన
Nagababu opines on MAA elections

'మా' ఎన్నికల వ్యవహారంపై ఓ టీవీ చానల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో నటుడు నాగబాబు తన అభిప్రాయాలు పంచుకున్నారు. కొందరు లోకల్, నాన్ లోకల్ అనే పనికిమాలిన అంశాన్ని తెరపైకి తెచ్చారని మండిపడ్డారు. సినిమాకు సంబంధించిన వ్యక్తులకు అలాంటి భేదాలు ఉండవని అన్నారు. విష్ణు నిలబడ్డాడని ప్రకాశ్ రాజ్ ను వెనక్కి నెట్టలేమని స్పష్టం చేశారు. ప్రకాశ్ రాజ్ అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన నటుడు అని పేర్కొన్నారు.

నరేశ్ 'మా'ను భ్రష్టు పట్టించాడని ఆరోపించిన నాగబాబు..  'మా'కు ప్రకాశ్ రాజ్ సేవలు అవసరమని అభిప్రాయపడ్డారు. మంచి చేస్తానని ముందుకు వచ్చినందుకే ప్రకాశ్ రాజ్ కు తాము మద్దతు ఇస్తున్నామని వివరించారు. ఓటర్లను ప్రభావితం చేసే విధంగా మంచు ప్యానెల్ వారే డబ్బులు కట్టడం విచారకరమని అన్నారు. మా ఎన్నికలకు ఆటంకం కలిగించకూడదన్న ఉద్దేశంతోనే డబ్బులు కట్టిన విషయంపై ఫిర్యాదు చేయడంలేదని మెగాబ్రదర్ స్పష్టం చేశారు.

More Telugu News