'పుష్ప'లో జబర్దస్త్ ఐటెం సాంగ్.. బాలీవుడ్ భామ ‘డిమాండ్’ విని షాక్ అయిన మేకర్స్!
Add ap7am to your home Screen

'పుష్ప'లో జబర్దస్త్ ఐటెం సాంగ్.. బాలీవుడ్ భామ ‘డిమాండ్’ విని షాక్ అయిన మేకర్స్!

Nora Fatehi Demands 2 Cr For Item Song In Pushpa
  • బన్నీతో సుకుమార్ 'పుష్ప' 
  • నోరా ఫతేహిని సంప్రదించిన డైరెక్టర్
  • రూ.2 కోట్లు డిమాండ్ చేసిన నోరా
  •  
  • టెంపర్ కు రూ.5 లక్షలే తీసుకున్న బాలీవుడ్ బ్యూటీ
సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ అనగానే క్లాస్ సినిమాలు గుర్తొస్తాయి. క్లాస్ తో పాటు ఆ సినిమాల్లోని మాస్ ఐటెం సాంగ్ లూ వారి కాంబోలో ట్రేడ్ మార్కే. ప్రస్తుతం వారి కాంబినేషన్ లో వస్తున్న మాస్ సినిమా పుష్ప. ఈ సినిమాలోనూ సుకుమార్ ఓ జబర్దస్త్ ఐటెం సాంగ్ కు ప్లాన్ చేశాడు.

ఆ పాట కోసం.. ఇప్పటికే తెలుగులో ఎన్టీఆర్ తో టెంపర్ సినిమాలోని ఐటెం సాంగ్ లో ఆడిపాడిన నోరా ఫతేహిని ఆయన సంప్రదించాడట. కానీ, ఆమె డిమాండ్ చేసిన పారితోషికం విని డైరెక్టర్ తో పాటు, సినీ నిర్మాతలు నోరెళ్లబెట్టారని టాక్. అవును మరి, ఐదారు నిమిషాల పాట కోసం ఆమె రూ.2 కోట్లు డిమాండ్ చేసిందని ఫిల్మ్ నగర్ వర్గాల భోగట్టా.


టెంపర్ సినిమా కోసం కేవలం రూ.5 లక్షలే తీసుకున్న ఆమె.. ఇప్పుడు రెమ్యునరేషన్ ను ఇంతలా పెంచేయడంపై వారు షాక్ అయ్యారట. అంతేగాకుండా తెలుగులో యువ హీరోలకు సైతం అంత పారితోషకం లేదన్న చర్చ సాగుతోంది. అయితే, నోరా డిమాండ్లకు చిత్ర నిర్మాతలు సై అన్నారా? లేదా? అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

వాస్తవానికి ఆమె నర్తిస్తున్న ఐటెం సాంగ్స్ అన్నీ సూపర్ డూపర్ హిట్ అవుతున్నాయి. దీంతో ఆమెకు బాలీవుడ్ లో క్రేజ్ తో పాటు డిమాండ్ బాగా పెరిగిపోయింది. అందుకే ఆమె అంతలా పారితోషికం డిమాండ్ చేసి ఉంటుందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. కాగా, క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 17న పుష్ప తొలి భాగాన్ని విడుదల చేయనున్న సంగతి తెలిసిందే.
Tollywood
Pushpa
Allu Arjun
Sukumar
Bollywood
Nora Fatehi

More Telugu News