నరేశ్, కరాటే కల్యాణిలపై ఎన్నికల అధికారికి హేమ ఫిర్యాదు
- తనపై అసభ్య వ్యాఖ్యలు చేశారంటూ 'మా' ఎన్నికల అధికారికి ఫిర్యాదు
- తన ఫొటోలను మార్ఫింగ్ చేసి దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపణ
- ఓటు వేయకుండా నిషేధం విధించాలని విన్నపం
తనపై వీరు అసభ్య వ్యాఖ్యలు చేశారని, అసభ్య వ్యాఖ్యలతో కూడిన వీడియోను విడుదల చేశారని లేఖలో తెలిపారు. తన ఫోటోలను మార్ఫింగ్ చేసి దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. వీరిద్దరిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అంతేకాదు, సోషల్ మీడియా లింక్ ను కూడా ఎన్నికల అధికారికి పంపారు. అక్టోబర్ 10న జరగనున్న 'మా' ఎన్నికల్లో నరేశ్, కరాటే కల్యాణిలు ఓటు వేయకుండా నిషేధం విధించాలని కోరారు.