తమరి వైవాహిక సంస్కారాలు, వరాహ సమానులకు న‘మస్కా’రాలు: పవన్ కు మంత్రి పేర్ని నాని కౌంటర్
- పవన్-నాని మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధం
- జనం ఛీత్కారాలు.. అంటూ నాని ట్వీట్
- పవన్‌పై ట్రోలింగ్ వీడియో షేర్
నాని వ్యాఖ్యలపై ట్విట్టర్ ద్వారా స్పందించిన పవన్.. ‘‘తుమ్మెదల ఝుంకారాలు, నెమళ్ల క్రేంకారాలు, ఏనుగుల ఘీంకారాలు, వైసీపీ గ్రామ సింహాల గోంకారాలు సహజమే’’ నంటూ గత రాత్రి ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్‌పై తాజాగా స్పందించిన మంత్రి పేర్ని నాని అదే స్థాయిలో మళ్లీ విరుచుకుపడ్డారు. ‘‘జనం ఛీత్కారాలు, ఓటర్ల తిరస్కారాలు, తమరి వైవాహిక సంస్కారాలు, వరాహ సమానులకు న‘మస్కా’రాలు’’ అని ట్వీట్ చేస్తూ పవన్‌పై ఓ ట్రోలింగ్ వీడియోను షేర్ చేశారు.