Varudu Kavalenu: దసరాకు వస్తున్న 'వరుడు కావలెను'

  • నాగశౌర్య, రీతూవర్మ జంటగా 'వరుడు కావలెను'
  • లక్ష్మీ సౌజన్య దర్శకత్వం
  • అక్టోబరు 15న విడుదల
  • ప్రకటించిన చిత్రబృందం
Varudu Kavalenu movie set to release on

ఇటీవల టాలీవుడ్ లో మహిళా దర్శకుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అలాంటివారిలో లక్ష్మీ సౌజన్య ఒకరు. ఆమె దర్శకత్వం వహించిన 'వరుడు కావలెను' చిత్రం విడుదలకు సిద్ధమైంది. విజయదశమి కానుకగా అక్టోబరు 15న ఈ యూత్ ఫుల్ ఎంటర్టయినర్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

ఈ మేరకు చిత్రబృందం ప్రకటించింది. ఈ చిత్రంలో నాగశౌర్య, రీతూవర్మ జంటగా నటించారు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టయిన్ మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కింది. విశాల్ చంద్రశేఖర్ స్వరపరిచిన పాటలు ఇప్పటికే ప్రజాదరణ పొందాయి.

More Telugu News