సైక్లోన్ గులాబ్.. ఏపీ, తెలంగాణకు భారీ వర్షాల హెచ్చరిక
- బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా మారుతున్న అల్పపీడనం
- ఇవాళ, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు
- గంటకు 65 కిలోమీటర్ల వేగంతో గాలులు
- ఐఎండీ వాతావరణ హెచ్చరిక
- ఒడిశా, ఛత్తీస్ గఢ్ లకూ వార్నింగ్
ఏపీ, ఒడిశాతో పాటు తెలంగాణ, ఛత్తీస్ గఢ్ లలోనూ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. గంటకు 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. ఆ గాలుల వేగం రేపటికి 75 కిలోమీటర్లకు పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. మత్స్యకారులెవరూ చేపల వేటకు వెళ్లొద్దని సూచించింది. వెళ్లిన వారు వెంటనే తిరిగొచ్చేయాలని సూచించింది.