పిల్లాడి కాన్ఫిడెన్స్ చూసి ముచ్చటపడిపోయిన కేటీఆర్.. వీడియో ఇదిగో!
- పేపర్ వేస్తూ చదువుకుంటున్న జగిత్యాల చిన్నారి
- పేపర్ ఎందుకు వేస్తున్నావంటూ ప్రశ్నించిన స్థానికుడు
- ఏం వేయకూడదా? అంటూ ఎదురు ప్రశ్నించిన చిన్నారి
- ఇప్పుడు కష్టపడితేనే భవిష్యత్ లో బాగుంటామని కామెంట్
- ఆ వీడియోను ట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్
చదువుకోవాల్సిన వయసులో పేపర్ ఎందుకు వేస్తున్నావ్? అని అడిగాడు. దీంతో ఆ అబ్బాయి.. ‘‘ఏం పేపర్ వేయకూడదా? అదేమైనా తప్పా? చదువుకుంటూనే పనిచేస్తున్నా. దాంట్లో తప్పేముంది?’’ అంటూ ఆ వ్యక్తికి సమాధానమిచ్చాడు. తన పేరు శ్రీ ప్రకాశ్ అని, స్థానిక ఓల్డ్ హైస్కూల్ చదువుతున్నానని చెప్పాడు. 'ఇప్పుడు కష్టపడితేనే భవిష్యత్ లో బాగుంటాం కదా!' అంటూ పెద్ద ఆరిందాలా ఆ చిన్నారి చెప్పుకొచ్చాడు.
అతడి మాటలకు మంత్రి కేటీఆర్ కూడా ఫిదా అయ్యారు. అతడి ఆత్మవిశ్వాస స్థాయులు అమోఘమని కొనియాడారు. ఆలోచనల్లో స్పష్టత, హావభావాలు అన్నీ సూపర్ అన్నారు. చదువుకుంటూ పనిచేయడంలో తప్పేముందన్న అతడి క్లారిటీ చూస్తే ముచ్చటేస్తోందని మెచ్చుకున్నారు.