Corona Virus: దేశంలో క‌రోనా కేసుల అప్‌డేట్స్‌

  • నిన్న కొత్తగా 26,964 క‌రోనా కేసులు
  • కేసుల మొత్తం సంఖ్య‌ 3,35,31,498 
  • మ‌రో 383 మంది మృతి
  • మొత్తం మృతుల సంఖ్య 4,45,768
corona bulletin in inida

దేశంలో నిన్న కొత్తగా 26,964 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది. దీంతో దేశంలో క‌రోనా కేసుల మొత్తం సంఖ్య‌ 3,35,31,498కి చేరింది. అలాగే, నిన్న 34,167 మంది కోలుకున్నార‌ని పేర్కొంది. దేశంలో క‌రోనాతో మ‌రో 383 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 4,45,768కి పెరిగింది.  

ఇక క‌రోనా నుంచి ఇప్ప‌టివ‌ర‌కు 3,27,83,741మంది కోలుకున్నారు. ప్ర‌స్తుతం 3,01,989 మందికి ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్‌ల‌లో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 82,65,15,754డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు.

More Telugu News