సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- డాక్టర్ ఫాతిమా పాత్రలో రకుల్ లుక్
- 'ఆదిపురుష్' కోసం యాక్షన్ దృశ్యాలు
- మొదలైన 'ఎఫ్ 3' తాజా షెడ్యూలు
* బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న 'ఆదిపురుష్' చిత్రం షూటింగ్ ముంబైలో జరుగుతోంది. త్వరలో ప్రభాస్ పాల్గొనే ఓ భారీ యాక్షన్ సీన్ ను ఈ చిత్రం కోసం చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది. ఇందులో కృతిసనన్ కథానాయికగా నటిస్తోంది.
* వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'ఎఫ్ 3' చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రం తాజా షెడ్యూలు షూటింగు నిన్నటి నుంచి హైదరాబాదులో జరుగుతోంది. ఈ భారీ షెడ్యూలులో ప్రధాన తారాగణమంతా పాల్గొంటారు. ఇందులో తమన్నా, మెహ్రీన్ కథానాయికలుగా నటిస్తున్నారు.