Chandrababu: చంద్రబాబు లాంటి అసమర్థుడితో జగన్ ఫైట్ చేయాల్సి రావడం బాధాకరం: పేర్ని నాని

Minister Perni Nani fires on Chandrababu
షార్ట్స్‌లో చూడండి
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అసమర్థుడని, అలాంటి వ్యక్తితో సీఎం జగన్ ఫైట్ చేయాల్సి రావడం నిజంగా బాధాకరమని మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు. వెలగపూడి సచివాలయంలో నిన్న ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రంలో నేరాలు పెరిగిపోతున్నాయని చంద్రబాబు ఊదరగొడుతున్నారని, మరి గత వారం రోజులుగా పొరుగు రాష్ట్రం తెలంగాణలో ఏం జరుగుతుందో చూడడం లేదా? అని ప్రశ్నించారు. తెలంగాణలో ఉంటున్న టీడీపీ నేతలు, చంద్రబాబు, లోకేశ్‌ బాధిత బాలిక కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు.

 కాగా, ఈ నెల 27న నిర్వహించనున్న భారత్ బంద్‌కు వైసీపీ మద్దతు ఇస్తోందన్న మంత్రి.. ఏం చేయాలన్న దానిపై అప్పుడే నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇదిలావుంచితే, స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్టు మంత్రి చెప్పారు.
Go Back to Shorts
Chandrababu
Perni Nani
YSRCP
TDP

More Telugu News