సారంగ ధరియా పాట పాడిన కొరియా అమ్మాయి... వైరల్ అవుతున్న వీడియో
- లవ్ స్టోరీ చిత్రంలోని పాటకు విదేశీయులు ఫిదా
- కొరియాలోనూ వినిపిస్తున్న సారంగ దరియా పాట
- కొరియన్ యువతి పాడిన పాటకు విశేష స్పందన
- 8.70 లక్షలకు పైగా వ్యూస్
కొరియన్ యువతి తాను ఆలపించిన వీడియోను యూట్యూబ్ లో పోస్టు చేయగా 8.70 లక్షల మందికి పైగా వీక్షించారు. ఆ యువతి తన పేరును వెల్లడించలేదు. తన యూట్యూబ్ చానల్లో మాత్రం కొరియన్ జీ1 అని పేర్కొంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా తెరకెక్కిన లవ్ స్టోరీ చిత్రంలోనిదే ఈ సారంగ దరియా పాట.