Manchu Manoj: విజనరీ సీఎం జగన్ ను కలవడాన్ని గౌరవంగా భావిస్తున్నా: మంచు మనోజ్

  • సీఎం జగన్ కు కలిసిన సినీ నటుడు మంచు మనోజ్
  • చేయబోతున్న పనులను సీఎంగారి నుంచి తెలుసుకున్నానని ట్వీట్
  • వాటిని పూర్తి చేసే శక్తిని భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటున్నానన్న మనోజ్
 It was an honor and privilege to meet the visionary CM Jagan says Manchu Manoj

ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను సినీ నటుడు మంచు మనోజ్ కలిశాడు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ఆయన వెల్లడించాడు. 'దూరదృష్టి కలిగిన ముఖ్యమంత్రి జగన్ గారిని కలవడాన్ని గౌరవంగా భావిస్తున్నానని మనోజ్ ఈ సందర్భంగా తెలిపాడు. రానున్న సంవత్సరాల్లో చేయబోతున్న పనుల గురించి సీఎంగారి నుంచి తెలుసుకున్నానని చెప్పాడు. 'సార్ మీరు అనుకున్న అన్ని పనులను నిర్విఘ్నంగా పూర్తి చేసే శక్తిని ఆ భగవంతుడు మీకు ఇవ్వాలని కోరుకుంటున్నా' అని మనోజ్ ట్వీట్ చేశాడు. మీ పాలనకు శుభాకాంక్షలు తెలుపుతున్నానని చెప్పాడు.

More Telugu News