Arvind Swamy: కంగన రనౌత్ నుంచి చాలా నేర్చుకున్నా: అరవింద్ స్వామి

Learnt many things from Kangana Ranaut says Arvind Swamy
షార్ట్స్‌లో చూడండి
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అలనాటి అందాల నటి జయలలిత బయోపిక్ 'తలైవి' పేరుతో తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో జయలలిత పాత్రను బాలీవుడ్ నటి కంగన రనౌత్ పోషిస్తుండగా ఆమె రాజకీయ గురువు, సహ నటుడు ఎంజీఆర్ పాత్రను అరవింద్ స్వామి పోషిస్తున్నారు. ఈ నెల 10న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది.

ఈ సందర్భంగా అరవింద్ స్వామి మాట్లాడుతూ, 'తలైవి'లో నటించడం ఒక అద్భుతమైన అనుభవమని చెప్పారు. ఈ సినిమాను కంగన తన భుజాలపై మోశారని కితాబునిచ్చారు. సినిమా షూటింగ్ సమయంలో కంగన నుంచి తాను చాలా నేర్చుకున్నానని చెప్పారు. కొన్ని రోజుల క్రితం సినిమా ఫైనల్ కాపీని చూశానని... ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ అవుతుందనే నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్ దర్శకత్వం వహించారు. టాలీవుడ్ నిర్మాత విష్ణు ఇందూరి, బాలీవుడ్ నిర్మాత శైలేశ్ సింగ్ దీనిని సంయుక్తంగా నిర్మించారు.
Go Back to Shorts
Arvind Swamy
Kangana Ranaut
Thalaivi
Jayalalitha Biopic
Tollywood

More Telugu News