కోపంతో రిబ్బ‌న్‌ను ప‌ళ్ల‌తో కొరికి క‌ట్ చేసి పారేసిన మంత్రి.. వీడియో వైర‌ల్

కోపంతో రిబ్బ‌న్‌ను ప‌ళ్ల‌తో కొరికి క‌ట్ చేసి పారేసిన మంత్రి.. వీడియో వైర‌ల్

  Pakistan ministers ribbon cutting in unusual style leaves netizens in splits
  • పాకిస్థాన్‌లో ఘ‌ట‌న‌
  • క‌త్తెర‌కు ప‌దును లేద‌ని కోపం
  • పాక్ మంత్రిపై నెటిజ‌న్ల సెటైర్లు
ఓ దుకాణాన్ని ప్రారంభించ‌డానికి వెళ్లిన ఓ పాకిస్థాన్ మంత్రి రిబ్బ‌న్‌ను క‌త్తెర‌తో కాకుండా పళ్ల‌తో కొరికిపారేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైర‌ల్ అవుతోంది. పాక్ మంత్రి తీరుపై నెటిజ‌న్లు సెటైర్లు వేస్తున్నారు. తాజాగా లాహోర్‌లో కొత్త‌గా నిర్మించిన ఓ దుకాణాన్ని ప్రారంభించడానికి పాక్ మంత్రి ఫయాజ్ ఉల్ హసన్ చౌహాన్ వెళ్లారు.

దుకాణ ప్ర‌వేశ ద్వారం వ‌ద్ద క‌ట్టిన‌ రిబ్బన్ ను ఆయ‌న క‌ట్ చేసి లోప‌లికి వెళ్లాల్సి ఉంది. దాని కోసం నిర్వాహ‌కులు క‌త్తెర కూడా తీసుకొచ్చారు. అయితే, ఆ క‌త్తెర‌ పదునుగా లేదు. ఎంత‌గా ట్రై చేసినా అది క‌ట్ కాలేదు.  దీంతో ఆ మంత్రికి చిర్రెత్తుకొచ్చింది. షాపు యజమానిని తిట్టుకుంటూ ప‌ళ్ల‌తోనే రిబ్బ‌న్ ను పరపరా క‌ట్ చేసిపారేశారు. అది చూసి, అక్క‌డున్న వారు మాత్రం న‌వ్వు ఆపుకోలేక‌పోయారు. మరోపక్క, ఆయ‌న తీరుపై నెటిజ‌న్లు సెటైర్లు వేస్తున్నారు.
Pakistan
Viral Videos

More Telugu News