ప్రభాస్ 25వ సినిమా నిర్మాతగా దిల్ రాజు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రభాస్ 25వ సినిమా నిర్మాతగా దిల్ రాజు!

Prabhas movies update
  • విడుదలకి సిద్ధమైన 'రాధే శ్యామ్'
  • షూటింగు దశలో 'సలార్'
  • ఇటీవలే మొదలైన 'ఆదిపురుష్'
  • నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ కి సన్నాహాలు
ప్రభాస్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇవన్నీ పాన్ ఇండియా సినిమాలు కావడం .. ఒకదానితో ఒకటి సంబంధం లేని జోనర్లు కావడం విశేషం. ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకులను పలకరించడానికి 'రాధే శ్యామ్' సిద్ధమవుతోంది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

ఇక ప్రశాంత్ నీల్ తో చేస్తున్న 'సలార్' .. ఓంరౌత్ తో చేస్తున్న 'ఆది పురుష్' సెట్స్ పైనే ఉన్నాయి. ఈ సినిమాల తరువాత ఆయన నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మరో పాన్ ఇండియా సినిమా చేయనున్నాడు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. కెరియర్ పరంగా ఇది ప్రభాస్ కి 24వ సినిమా.

ఇక ఆయన తన 25వ సినిమాను దిల్ రాజు నిర్మాణంలో చేయనున్నట్టు ఒక వార్త వినిపిస్తోంది. వచ్చే ఏడాది చివరిలో ఈ ప్రాజెక్టు పనులు మొదలు కావొచ్చని అంటున్నారు. పరిశీలనలో ఉన్నట్టుగా ఒకటి రెండు టైటిల్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.
Prabhas
Radhe Shyam
Salaar
Adi Purush

More Telugu News