Deepika Padukone: మరోసారి హాలీవుడ్ సినిమాలో దీపిక.. ఈసారి నిర్మాతగా కూడా!

  • 'రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్'లో నటించిన దీపిక
  • తాజాగా హాలీవుడ్ రొమాంటిక్ కామెడీలో ఛాన్స్
  • ఎస్టీఎక్స్ ఫిలిమ్స్ తో కలిసి భాగస్వామ్యం
Deepika Padukone stars in another Hollywood flick

మన బాలీవుడ్ భామలు అవకాశం దొరికితే హాలీవుడ్ సినిమాలు చేయడానికి కూడా ఉత్సాహం చూపుతుంటారు. ఆ విధంగా ఇప్పటికే ప్రియాంక చోప్రా హాలీవుడ్ లో విజయవంతంగా కొనసాగుతోంది. మరోపక్క, చేతినిండా ప్రాజక్టులతో బాలీవుడ్ లో బిజీగా వున్న స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణే ఆమధ్య 'రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్' అనే సినిమాలో నటించి హాలీవుడ్ ప్రవేశం చేసింది. ఈ క్రమంలో ఇప్పుడు మరోసారి హాలీవుడ్ సినిమాలో నటించడానికి సిద్ధపడుతోంది.
 
రొమాంటిక్ కామెడీగా రూపొందే ఈ చిత్రాన్ని ఎస్టీఎక్స్ ఫిలిమ్స్ నిర్మిస్తోంది. టెంపుల్ హిల్ ప్రొడక్షన్స్ కూడా ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామి అవుతోంది. మరో విశేషం ఏమిటంటే, కథానాయిక దీపిక ఇందులో నటించడమే కాకుండా, తాను కూడా ఓ నిర్మాతగా ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామ్యం తీసుకుంటోంది.

ఈ విషయాన్ని ఈ రోజు ఎస్టీఎక్స్ ఫిలిమ్స్ చైర్మన్ ఆడమ్ ఫోజిల్సన్ మీడియాకు వెల్లడించారు. 'దీపిక ఎంతో ప్రతిభావంతురాలైన ఆర్టిస్టు అనీ, అంతర్జాతీయ స్థాయి సూపర్ స్టార్ గా ఎదుగుతోందనీ ఆయన కొనియాడారు. ఎన్నో ప్రణయకథా చిత్రాలలో నటించి, సక్సెస్ అయిన దీపికతో ఓ రొమాంటిక్ కామెడీ సినిమా చేయడానికి థ్రిల్ ఫీలవుతున్నామని అన్నారాయన. ఈ సినిమాలో నటిస్తున్నందుకు, ఎస్టీఎక్స్ ఫిలిమ్స్, టెంపుల్ హిల్ ప్రొడక్షన్స్ తో తన చిత్ర నిర్మాణ సంస్థ 'కా ప్రొడక్షన్స్' భాగస్వామ్యాన్ని పంచుకుంటున్నందుకు హ్యాపీగా ఉందని చెప్పింది దీపిక.

More Telugu News