Tollywood: ఈ వారంలో థియేటర్ - ఓటీటీలలో విడుదల కానున్న సినిమాలు ఇవిగో!

  • సినీ పరిశ్రమలో మళ్లీ నెలకొన్న సందడి
  • థియేటర్లలో విడుదల అవుతున్న పలు చిత్రాలు
  • బట్టతలతో సందడి చేయబోతున్న అవసరాల శ్రీనివాస్
Telugu films releasing this week

కరోనా తగ్గుముఖం పట్టడంతో చిత్ర పరిశ్రమలో తిరిగి సందడి నెలకొంది. షూటింగులు మళ్లీ జోరుగా సాగుతున్నాయి. థియేటర్లు కూడా తెరుచుకుని నెల దాటుతోంది. పలు చిత్రాలు నేరుగా థియేటర్లలో విడుదల అవుతుండగా, మరికొన్ని చిత్రాలు ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. ఈ వారం కూడా పలు చిత్రాలు థియేటర్లు, ఓటీటీలలో విడుదల కానున్నాయి. ఆ సినిమాలేంటో ఓ లుక్కేద్దాం.

డియర్ మేఘ: మేఘా ఆకాశ్, అరుణ్ ఆదిత్, అర్జున్ సోమయాజులు ప్రధాన పాత్రలను పోషించారు. సుశాంత్ రెడ్డి దర్శకత్వం వహించగా, అర్జున్ దాస్యన్ నిర్మించారు. సెప్టెంబర్ 3న ఈ ప్రేమకథా చిత్రం థియేటర్లలో విడుదల కానుంది.

నూటొక్క జిల్లాల అందగాడు: ఈ సినిమా ద్వారా అవసరాల శ్రీనివాస్ మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. రుహానీశర్మ కథానాయికగా నటించింది. బట్టతలతో ఈ చిత్రంలో శ్రీనివాస్ వెరైటీ లుక్ లో కనిపించనున్నాడు. పెళ్లికాక ముందే బట్టతల రావడంతో... అది కనిపించకుండా విగ్గుపెట్టుకునే పాత్రలో శ్రీనివాస్ నటించాడు. రాచకొండ విద్యాసాగర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. శిరీష్, రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మాతలుగా వ్యవహరించగా... దిల్ రాజు, క్రిష్ జాగర్లమూడి సమర్పకులుగా వ్యవహరించారు. సెప్టెంబర్ 3న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది.

అప్పుడు ఇప్పుడు: వినోదాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రంలో సుజన్, తనీష్క్ జంటగా నటించగా.. ఇతర కీలక పాత్రల్లో శివాజీరాజా, పేరుపురెడ్డి శ్రీనివాస్ నటించారు. జలపతి పువ్వల దర్శకత్వం వహించాడు. సెప్టెంబర్ 3న థియేటర్లలో విడుదల కాబోతోంది.

కిల్లర్: చిన్నా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కార్తీక్ సాయి, డాలీ షా, నేహా దేశ్ పాండే కీలక పాత్రలను పోషించారు. సెప్టెంబర్ 3న ఇది థియేటర్లలో విడుదల కానుంది.

అశ్మీ: సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం కూడా సెప్టెంబర్ 3న థియేటర్లలో విడుదల కాబోతోంది. రుషికా రాజ్, రాజ నరేంద్ర, కేశవ్ దీపకమ్, ఇందు కుసుమ తదితరులు కీలక పాత్రలు పోషించారు. శేష్ కార్తికేయ దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 3న థియేటర్లలో విదుడల కానుంది.

ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్-9: హాలీవుడ్ లో ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సిరీస్ లో ఇప్పటి వరకు ఎనిమిది చిత్రాలు విడుదలై ఘన విజయం సాధించాయి. ఇప్పుడు సిరీస్ లో తొమ్మిదవ చిత్రం అంతర్జాతీయంగా విడుదలై ఘన విజయం సాధించింది. తాజాగా భారతీయ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సెప్టెంబర్ 3న థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రంలో విన్ డీజిల్, మిషెల్లీ రోడ్రిగ్జ్ తదితరులు నటించారు.

ఓటీటీ - వెబ్ సిరీస్ లు:

  • గుడ్ గర్ల్స్ - ఆగస్ట్ 31 - నెట్ ఫ్లిక్స్
  • స్పార్కింగ్ జాయ్- ఆగస్ట్ 31 - నెట్ ఫ్లిక్స్
  • మనీ హెయిస్ట్ సీజన్ 5 - సెప్టెంబర్ 3 - నెట్ ఫ్లిక్స్
  • సిండ్రెల్లా - సెప్టెంబర్ 3 - అమెజాన్ ప్రైమ్ వీడియో
  • బ్లాక్ విడో - సెప్టెంబర్ 3 - అమెజాన్ ప్రైమ్ వీడియో
  • రెమినిసెన్స్ - సెప్టెంబర్ 3 - హెచ్బీవో మ్యాక్స్
  • హెల్మెట్ - సెప్టెంబర్ 3 - జీ5

More Telugu News