Tollywood: ఈరోజు విడుదల అవుతున్న ఐదు తెలుగు సినిమాలు ఇవే!

Five Telugu movies are releasing today
షార్ట్స్‌లో చూడండి
కరోనా సెకండ్ వేవ్ ప్రభావం కొంత తగ్గడంతో సినీ పరిశ్రమలో మళ్లీ సందడి మొదలైంది. ఇప్పుడిప్పుడే థియేటర్లలో కూడా సినిమాలు విడుదల అవుతున్నాయి. ప్రేక్షకులు నెమ్మదిగా థియేటర్లకు వెళ్లడం ప్రారంభమైంది. ప్రతి వారం కనీసం ఐదు సినిమాలు విడుదల అవుతున్నాయి. ఈరోజు కూడా ఐదు సినిమాలు విడుదల అవుతున్నాయి.

ఈరోజు విడుదల అవుతున్న సినిమాలు ఇవే:

ఇచ్చట వాహనములు నిలుపరాదు: సుశాంత్ హీరోగా నటించిన ఈ సినిమాను దర్శకుడు ఎస్. దర్శన్ తెరకెక్కించారు. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది.

శ్రీదేవి సోడా సెంటర్: సుధీర్ బాబు, ఆనంది హీరో, హీరోయిన్ పాత్రలను పోషించారు. ఈ సినిమాకు ప్రభాస్, మహేశ్ బాబు వంటి స్టార్లు సపోర్ట్ చేయడంతో... అంచనాలు ఎక్కువగా ఉన్నాయి.

సూర్యాస్తమయం: బండి సరోజ్ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రెండు దశాబ్దాల పాటు ఈ సినిమాను ప్రేక్షకులు గుర్తుంచుకుంటారని ఆయన చెప్పడం... ఈ సినిమా కథలో దమ్ముంది అనే విషయాన్ని చెబుతోంది. సరైన ప్రమోషన్ కూడా లేకుండానే ఈ సినిమా విడుదల అవుతోంది.

హౌస్ అరెస్ట్: హాస్యనటులు శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి ఇందులో ముఖ్యమైన పాత్రలను పోషించారు. పిల్లలు ప్రధాన పాత్రల్లో ఈ సినిమాను తెరకెక్కించారు.

గ్రేట్ శంకర్: మలయాళ చిత్రం 'మాస్టర్ పీస్'కు డబ్బింగ్ వర్షన్ ఇది. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో మమ్ముట్టి, వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్ ప్రధాన పాత్రలను పోషించారు.
Go Back to Shorts
Tollywood
New Movies
Release

More Telugu News