'వాల్తేర్ శీను'గా మాస్ మెగాస్టార్!

Chiranjeevi movie title confirmed
  • సెట్స్ పైకి వెళ్లిన 'గాడ్ ఫాదర్'
  • ఊపందుకోనున్న రెగ్యులర్ షూటింగ్
  • తదుపరి సినిమా బాబీతో
  • పూర్తి మాస్ లుక్ తో చిరూ
చిరంజీవి కథానాయకుడిగా .. ఆయన 153వ సినిమాగా 'లూసిఫర్' రీమేక్ రూపొందుతోంది. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి, 'గాడ్ ఫాదర్' టైటిల్ ను ఖరారు చేశారు. త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగు వేగాన్ని పుంజుకోనుంది.

ఆ తరువాత సినిమాను బాబీ దర్శకత్వంలో చిరంజీవి చేయనున్నారు. ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్ ను చిరంజీవి పుట్టినరోజున విడుదల చేశారు. ఈ సినిమాకి 'వీరయ్య' అనే టైటిల్ ను బాబీ అనుకున్నారట. కానీ చిరంజీవి టైటిల్ విషయంలో కాస్త అసంతృప్తిని వ్యక్తం చేయడంతో, టైటిల్ ను ఆపేసి పోస్టర్ ను మాత్రమే రిలీజ్ చేశారు. తాజాగా బాబీ 'వాల్తేర్ శీను' అనే టైటిల్ ను అనుకుని చిరంజీవికి చెబితే, ఆయన నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసిందని అంటున్నారు.

'గాడ్ ఫాదర్' లుక్ కీ .. కాన్సెప్ట్ కి, ఈ సినిమా లుక్ పూర్తి భిన్నంగా ఉండేలా చిరంజీవి చూసుకున్నారు. ఈ సినిమా పోస్టర్లో ఆయన లుంగీ పైకి కట్టి .. తలకి టవల్ చుట్టి .. బీడీ కాలుస్తూ .. లంగర్ పట్టుకుని కనిపిస్తున్నారు. అంటే సముద్రం తీరప్రాంతంలోని ఒక గూడెం నేపథ్యంలో ఈ కథ నడుస్తుందనే విషయం అర్థమవుతోంది.  

Go Back to Shorts
Chiranjeevi
Bobby
Tollywood

More Telugu News