'పలాస' దర్శకుడి చేతికి 'నాయాట్టు' రీమేక్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'పలాస' దర్శకుడి చేతికి 'నాయాట్టు' రీమేక్!

Karuna Kumar next movie is Nayattu remake
  • మలయాళంలో ఆదరణ పొందిన 'నాయాట్టు'
  • తెలుగు రీమేక్ కి సన్నాహాలు
  • తెరపైకి అంజలి పేరు
  • త్వరలో వెలువడనున్న ప్రకటన  
మలయాళంలో ఇటీవల వచ్చిన 'నాయాట్టు' సినిమాకి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. ఇంట్రెస్టింగ్ గా సాగే కంటెంట్ బేస్డ్ కథ ఇది. స్వార్థ రాజకీయాలు .. అవినీతి పరులైన రాజకీయనాయకులు సామన్యుల జీవితాలతో ఎలా ఆడుకుంటారు? పోలీస్ వ్యవస్థను ఎలా వాడుకుంటారు? అనే అంశాల చుట్టూ ఈ కథ నడుస్తుంది.

మార్టిన్ ప్రకట్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులను అల్లు అరవింద్ తీసుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఈ సినిమా దర్శకత్వ బాధ్యతను ఆయన 'పలాస' దర్శకుడికి అప్పగించాడని చెప్పుకుంటున్నారు. 'పలాస 1978' సినిమాతో దర్శకుడిగా కరుణకుమార్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఆయన తాజా చిత్రమైన 'శ్రీదేవి సోడా సెంటర్' షూటింగును పూర్తిచేసుకుని, పోస్టు ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. 'నాయాట్టు' రీమేక్ ఆయన చేతికి వెళ్లిందని అంటున్నారు. ఈ సినిమా కోసం అంజలి .. రావు రమేశ్ .. శ్రీవిష్ణు .. సత్యదేవ్ పేర్లను పరిశీలిస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన రావొచ్చని అంటున్నారు.  

Anjali
Sathyadev
Rao Ramesh
Sri Vishnu

More Telugu News