Pushpa: 'పుష్ప' సినిమా నుంచి విడుద‌ల‌కు సిద్ధ‌మైన‌ 'దాక్కో దాక్కో మేక‌.. పులొచ్చి కొట్టుద్ది పీక' పాట‌.. వీడియో ఇదిగో

  • దేవిశ్రీ ప్రసాద్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా అప్‌డేట్
  • ఆగ‌స్టు 13న విడుద‌ల
  • హిందీ, తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో పాట
pushpa first song releases on aug 13

దేవిశ్రీ ప్రసాద్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా.. ఆయ‌న సంగీతం అందిస్తోన్న పుష్ప సినిమా యూనిట్ ఓ అప్‌డేట్ ఇచ్చింది. పుష్ప సినిమా నుంచి 'దాక్కో దాక్కో మేక‌.. పులొచ్చి కొట్టుద్ది పీక.. హుయ్' అంటూ సాగే పాటను ఆగ‌స్టు 13న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలిపింది.

తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ పాటను విడుద‌ల చేయ‌నున్నారు. ఈ పాట లిరిక్స్ ఆయా భాష‌ల్లో ఎలా ఉండ‌నున్నాయ‌న్న విష‌యాన్ని దేవిశ్రీ ప్ర‌సాద్ తెలిపాడు. ఆయ‌న‌కు అల్లు అర్జున్ స‌హా పుష్ప సినిమా యూనిట్ అంతా పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలుపుతోంది.

ఆ పాట‌ దుమ్ములేపేందుకు సిద్ధ‌మ‌వుతోంద‌ని అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఈ సినిమా ద్వారా సుకుమార్, అల్లు అర్జున్ చేసే మేజిక్ చూడ‌డానికి ఆత్రుత‌గా ఎదురుచూస్తున్నామ‌ని అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు.  

సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమా మొద‌టి భాగం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానున్న‌ట్లు తెలుస్తోంది. కాగా 'అల.. వైకుంఠపురములో' వంటి భారీ హిట్ తర్వాత అల్లు అర్జున్ నటిస్తోన్న సినిమా 'పుష్ప'పై భారీ అంచనా‌లు ఉన్నాయి. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్ లో అల్లు అర్జున్ క‌న‌ప‌డిన తీరు అదుర్స్ అనిపించింది. ఈ సినిమాను మైత్రీ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది.

More Telugu News