'స్నేహితుడితో వ‌చ్చే ప్రాబ్లం ఇదే' అంటూ ఫ్రెండ్‌షిప్ డే రోజున‌ 'హ‌్యాపీ శ‌త్రువుల దినోత్స‌వం' అంటూ ఆర్జీవీ ట్వీట్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'స్నేహితుడితో వ‌చ్చే ప్రాబ్లం ఇదే' అంటూ ఫ్రెండ్‌షిప్ డే రోజున‌ 'హ‌్యాపీ శ‌త్రువుల దినోత్స‌వం' అంటూ ఆర్జీవీ ట్వీట్

rgv tweets on friendship day
  • స్నేహితుడికి సాయం చేస్తే ఓ స‌మ‌స్య వ‌స్తుంది
  • వాడికి మ‌రోసారి సాయం అవ‌స‌ర‌మైతే మ‌ళ్లీ నీ ద‌గ్గ‌రికే వ‌స్తాడు: ఆర్జీవీ
  • ఆర్జీవీపై నెటిజ‌న్ల మండిపాటు
స్నేహితుల దినోత్స‌వం సంద‌ర్భంగా అంద‌రూ హ్యాపీ ఫ్రెండ్ షిప్ డే అంటూ పోస్టులు చేస్తుండ‌గా, వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ మాత్రం 'హ్యాపీ ఎనిమీస్ డే' అంటూ ట్వీట్ చేశారు. అలాగే, స్నేహితులు ఎలా ఉంటారన్న విష‌యంపై ఆయ‌న అభిప్రాయం తెలిపారు.

'స్నేహితుడికి సాయం చేస్తే ఓ స‌మ‌స్య వ‌స్తుంది. వాడికి మ‌రోసారి సాయం అవ‌స‌ర‌మైన‌ప్పుడు కూడా మ‌ళ్లీ నీ ద‌గ్గ‌రికే వ‌చ్చి అడుగుతాడు' అని రామ్ గోపాల్ వ‌ర్మ‌ పేర్కొన్నారు. రామ్ గోపాల్ వ‌ర్మ చేసిన ట్వీట్ పై నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు. స్వ‌చ్ఛ‌మైన స్నేహానికి ఆర్జీవీ కొత్త నిర్వ‌చ‌నం ఇస్తూ స్నేహానికి ఉన్న విలువ‌ను చెడ‌గొడుతున్నారంటూ కామెంట్లు చేస్తున్నారు. కొంద‌రు మాత్రం ఆర్జీవీ చెప్పిందే క‌రెక్టు అంటూ రిప్లై ఇస్తున్నారు.
RGV
Friendship Day
Twitter

More Telugu News