'ఆర్ ఆర్ ఆర్' నుంచి ఫస్టు సాంగ్ రిలీజ్ డేట్ ఖరారు!
Add ap7am to your home Screen

'ఆర్ ఆర్ ఆర్' నుంచి ఫస్టు సాంగ్ రిలీజ్ డేట్ ఖరారు!

First song from RRR movie on August 1st
  • ముగింపు దశలో 'ఆర్ ఆర్ ఆర్'
  • ఫస్టు సాంగ్ రిలీజ్ కి సన్నాహాలు
  • ఆగస్టు 1వ తేదీ ముహూర్తం
  • అక్టోబర్ 13వ తేదీన సినిమా రిలీజ్
రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ఆర్ఆర్' రూపొందుతోంది. చిత్రీకరణపరంగా ఈ సినిమా ముగింపు దశకు చేరుకుంది. ఎన్టీఆర్ .. చరణ్ ఇద్దరూ కూడా చారిత్రక నేపథ్యంతో కూడిన పాత్రలను పోషిస్తూ ఉండటంతో, ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్లు .. స్పెషల్ వీడియోలు అంతకంతకూ ఆసక్తిని రేకెత్తిస్తూ వచ్చాయి.

భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ సినిమాకి కీరవాణి సంగీతాన్ని అందించారు. ఇక ఈ సినిమా నుంచి ఫస్టు సాంగును రిలీజ్ చేయడానికి ముహూర్తం కుదిరింది. ఫ్రెండ్షిప్ డే కానుకగా ఆగస్టు 1వ తేదీన ఉదయం 11 గంటలకు ఫస్టు సాంగును రిలీజ్ చేయనున్నట్టు అధికారికంగా ఒక పోస్టర్ ను వదిలారు. స్నేహం నేపథ్యంలో సాగే ఈ పాట, ఒకేసారి 5 భాషల్లో విడుదల కానుంది.

ఈ పోస్టర్ లో కీరవాణితో పాటు అనిరుధ్ రవిచంద్రన్ .. విజయ్ ఏసుదాసు తదితరులు కనిపిస్తున్నారు. దేశభక్తి నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో, అజయ్ దేవగణ్ .. అలియా భట్ వంటి బాలీవుడ్ నటీనటులతో పాటు, హాలీవుడ్ ఆర్టిస్టులు కూడా కనిపించనున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 13వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.
Jr NTR
Ramcharan
Alia Bhatt

More Telugu News