బీహార్‌లో పోలీసులపై గ్రామస్థుల రాళ్ల దాడి.. మహిళా కానిస్టేబుల్ మృతి
- పోలీసుల కస్టడీలో ఉన్న వ్యక్తి మృతి
- పోలీస్ స్టేషన్‌ను ముట్టడించిన గ్రామస్థులు
- కర్రలు, రాళ్లతో దాడి
- పలువురు పోలీసులకు గాయాలు, ధ్వంసమైన వాహనాలు
గ్రామస్థులు పోలీసులపై రాళ్లు రువ్వుతూ, కర్రలతో దాడి చేశారు. దీంతో భయపడిన పోలీసులు వారి బారి నుంచి తప్పించుకునేందుకు పరుగులు తీశారు. గ్రామస్థుల దాడిలో పలువురు పోలీసులు గాయపడ్డారు. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ కమ్రంలో గ్రామస్థులను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్న కుంతీదేవి అనే మహిళా కానిస్టేబుల్ పైనుంచి ఓ వాహనం దూసుకుపోవడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలొదిలింది.
విషయం తెలిసిన పోలీసు ఉన్నతాధికారులు అదనపు సిబ్బందితో వచ్చి గ్రామస్థులను అదుపు చేశారు. పోలీసులపై దాడికి దిగిన వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో జహానాబాద్-అర్వాల్ రహదారిపై కొన్ని గంటలపాటు తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. కాగా, బీహార్‌లో సంపూర్ణ మద్య నిషేధం అమల్లో ఉంది. మద్యం విక్రయించే వారికి కఠిన శిక్షలు అమలు చేస్తున్నారు.