స్వర్ణం కోసం తీవ్రంగా ప్రయత్నించాను: మీరాబాయి చాను
- టోక్యో ఒలింపిక్స్ లో భారత పతకాల బోణీ
- వెయిట్ లిఫ్టింగ్ లో రజతం గెలిచిన చాను
- 49 కిలోల విభాగంలో సెకండ్ ప్లేస్
- కల నిజమైందన్న చాను
ఐదేళ్ల తన కృషి ఫలించినందుకు గర్వంగా ఉందని తెలిపింది. తాను కేవలం మణిపూర్ అమ్మాయిని కాదని, యావత్ భారతావనికి చెందుతానని మీరాబాయి చాను పేర్కొంది. తన ప్రస్థానంలో వెన్నుదన్నుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని వివరించింది. ముఖ్యంగా తన తల్లికి రుణపడి ఉంటానని, ఆమె తన కోసం ఎన్నో త్యాగాలు చేసిందని కొనియాడింది.