వైద్యురాలి స్నానాల గదిలో స్పై కెమెరా పెట్టిన న్యూరాలజిస్ట్
- ముంబైలోని ఓ మెడికల్ కాలేజీలో ట్రైనీగా పనిచేస్తున్న వైద్యురాలు
- ఆమె బాత్రూమ్, బెడ్రూములలో రహస్యంగా కెమెరాలు పెట్టిన వైద్యుడు
- బాత్రూములోని లైటు వెలగకపోవడంతో వెలుగులోకి
అతడొచ్చి బాగుచేస్తున్న క్రమంలో అందులోంచి స్పై కెమెరా బయటపడింది. దీంతో అప్రమత్తమైన వైద్యురాలు ఇంట్లో ఇంకెక్కడెక్కడ ఉన్నాయో పరిశీలించగా పడకగదిలో మరోటి కనిపించింది. దీంతో విస్తుపోయిన ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు అదే మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న 42 ఏళ్ల న్యూరాలజిస్ట్ ఈ దారుణానికి పాల్పడినట్టు తేల్చి అదుపులోకి తీసుకున్నారు.