రవితేజ పాత్రపై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు!
- రవితేజ కొత్త సినిమా 'రామారావు ఆన్ డ్యూటీ
- దర్శకుడిగా శరత్ మండవ పరిచయం
- దివ్యాన్ష కౌశిక్ రెండో సినిమా
- హైదరాబాద్ లో జరుగుతున్న షూటింగ్
ప్రస్తుతం ఈ సినిమా షూటింగు హైదరాబాదులో జరుగుతోంది. రవితేజ తదితరులపై కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ పాత్రలో రెండు విభిన్నమైన కోణాలు ఉంటాయట .. అవి ఎలా ఉంటాయనేదే ఆసక్తికరం. ఓ యథార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమా నిర్మితమవుతున్నట్టు చెబుతున్నారు. చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రవితేజ జోడీగా దివ్యాన్ష కౌశిక్ అలరించనుంది. 'మజిలీ' సినిమా ద్వారా ఆమె తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. 'ఖిలాడి' తరువాత ఈ సినిమా థియేటర్లకు రానుంది.