ఎట్టకేలకు దిగొచ్చిన ట్విట్టర్.. గ్రీవెన్స్ అధికారి నియామకం
- వినయ్ ప్రకాశ్ కు బాధ్యతలు
- ఈ మెయిల్ ఐడీని సృష్టించిన సంస్థ
- కోర్టు మొట్టికాయలు వేయడంతో దిగొచ్చిన ట్విట్టర్
ఈ నేపథ్యంలోనే రెసిడెంట్ గ్రీవెన్స్ ఆఫీసర్ గా వినయ్ ప్రకాశ్ ను ఇవాళ నియమించింది. అందుకోసం ప్రత్యేకంగా ఓ ఈమెయిల్ ఐడీనీ సృష్టించింది. భారత కొత్త ఐటీ చట్టంలోని 4 (1) (డీ) ప్రకారం గ్రీవెన్స్ అధికారిని నియమిస్తున్నామని ప్రకటించింది. వాస్తవానికి గ్రీవెన్స్ అధికారి నియామకం కోసం 8 వారాల సమయం కావాలంటూ గురువారం ట్విట్టర్ అఫిడవిట్ ను దాఖలు చేసింది. ఆ లోపే గ్రీవెన్స్ అధికారిని నియమించింది.