మహేశ్ మూవీలో పోలీస్ ఆఫీసర్ గా అర్జున్!
- తెలుగులోను అర్జున్ కి క్రేజ్
- విలన్ రోల్స్ లోను బిజీ
- తాజా చిత్రంగా 'సర్కారువారి పాట'
- మహేశ్ జోడీగా కీర్తి సురేశ్
ఈ నేపథ్యంలోనే 'సర్కారువారి పాట' సినిమాలో ఆయన ఒక కీలకమైన పాత్రను చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. దాంతో ఈ సినిమాలో ఆయనే విలన్ అనుకున్నారు. కానీ ఈ సినిమాలో ఆయన విలన్ కాదట .. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారని అంటున్నారు. గతంలో అర్జున్ పోలీస్ ఆఫీసర్ గా చేసిన చాలా సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అదే విధంగా ఈ సారి కూడా ఆయన మంచి మార్కులు కొట్టేయడం ఖాయమే. మహేశ్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో, కథానాయికగా కీర్తి సురేశ్ అలరించనున్న సంగతి తెలిసిందే.