Arjun: తమిళనాడు సీఎంతో సీనియర్ సినీ నటుడు అర్జున్ భేటీ

  • మర్యాదపూర్వకంగానే కలిశానన్న అర్జున్
  • జూలై 1, 2 తేదీల్లో ఆంజనేయ ఆలయంలో కుంభాభిషేకం
  • హాజరు కావాలని స్టాలిన్ ను కోరిన అర్జున్
Actor Arjun Meets CM Stalin

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ను సీనియర్ సినీ నటుడు అర్జున్ కలిశారు. తమ ఇంటికి వచ్చిన అర్జున్ కు స్టాలిన్ దంపతులు స్వాగతం పలికారు. తాను స్టాలిన్ ను మర్యాదపూర్వకంగానే కలిశానని ఈ సమావేశం అనంతరం అర్జున్ తెలిపారు. చెన్నైలోని కెరుగంబాక్కంలోని తన ఫామ్ హౌస్ లో ఆంజనేయుని ఆలయాన్ని నిర్మించిన అర్జున్, జులై 1, 2 తేదీల్లో కుంభాభిషేకాన్ని నిర్వహించాలని తలపెట్టారు.

ఈ కార్యక్రమానికి ఆహ్వానించేందుకే స్టాలిన్ ను కలిసినట్టుగా తెలుస్తోంది. స్టాలిన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత పలువురు ప్రముఖులు ఆయన్ను కలిసేందుకు ఆసక్తి చూపుతున్న సంగతి తెలిసిందే.

More Telugu News